Prakash Raj shared photos of Ganapati idols
mictv telugu

మోదీపై ప్రకాశ్ రాజ్.. మీ నమ్మకాలను దెబ్బతీయట్లేదా అని సెటైర్

September 1, 2022

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొద్ది మంది నటుల్లో దక్షిణాదికి చెందిన ప్రకాశ్ రాజ్ ఒకరు. తన విలక్షణ నటనతో ప్రతీ భాషలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ఈయన గత కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ, మోదీ, హిందూ వాదులకు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీని ఉద్దేశించి ఓ సెటైరికల్ ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. బుధవారం వినాయక చవితి పండుగ అని తెలిసిందే. దేశ వ్యాప్తంగా జరుపుకున్న ఈ పండుగలో కొన్ని విచిత్ర గణపతి విగ్రహాలు దర్శనమిచ్చాయి. మోదీ, ఆరెస్సెస్, కేజీఎఫ్ 2, పుష్ప తగ్గేదేలే అంటూ అభిమానులు తమకు నచ్చినట్టుగా గణేష్ విగ్రహాలను తయారు చేయించుకున్నారు. అలాంటి విగ్రహాల ఫోటోలను ట్వీట్ ద్వారా షేర్ చేసిన ప్రకాశ్ రాజ్.. ఇలాంటివి మీ నమ్మకాలను దెబ్బతీయడం లేదా.. అంటూ సెటైరికల్ కామెంట్ జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుండగా, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.