పేద కుటుంబానికి అండగా నిలిచిన ప్రకాశ్ రాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

పేద కుటుంబానికి అండగా నిలిచిన ప్రకాశ్ రాజ్

September 14, 2021

Prakash raj supports a poor family through JCB

విలక్షణ నటుడిగా పేరొందిన ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఆపద్భాందవుడిగా మారారు. ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ నిరుపేద కుటుంబానికి ఆయన జేసీబీని అందజేశారు. తాను స్థాపించిన ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్తరపున దీన్ని అందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఓ పేద కుటుంబానికి జేసీబీ అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. Prakash raj supports a poor family through JCB

జీవితాన్ని తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆనందమే వేరని ఆయన అన్నారు.మానవత్వమే మానవ ప్రగతికి సంకేతమని తెలిపారు. పేద కుటుంబాలలో సాధికారతను పెంపొందించడమే తన లక్ష్యమని చెప్పారు.ఆయన తన ఫౌండేషన్ ద్వారా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గత కొంత కాలం నుండి చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం వివిధ భాషల్లో ప్రకాశ్ రాజ్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాదు మాఅధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల బిజీలో ఆయన ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో జీవిత, హేమ కూడా ఉన్నారు.