బెస్ట్ ఆఫ్ లక్ ప్రకాశ్ రాజ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

బెస్ట్ ఆఫ్ లక్ ప్రకాశ్ రాజ్ !

July 26, 2017

ధోని, ఉలవచారు బిర్యాని, మన ఊరి రామాయణం సినిమాల తర్వాత ప్రకాశ్ రాజ్ తాజాగా హిందీలో చేస్తున్న సినిమా ‘ తడ్కా ’. ఈ సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం. తాప్సీ, శ్రీయ కూడా ముఖ్య పాత్రల్లో మెరుస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ప్రకాశ్ రాజ్ అత్యంత ప్రామాణికంగా రూపొందిస్తున్నాడట. అలీ ఫజల్ హీరోగా నటిస్తున్నాడు. నటుడిగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ప్రకాశ్ రాజ్ దర్శకుడిగా తన సత్తా చాటాలనుకుంటున్నాడు. తను డీల్ చేసే సబ్జెక్టులు రొటీన్ గా కాకుండా జర హట్కే వుంటాయని తెలిసిన ముచ్చటే. ధోని క్రికెట్ నేపథ్యంలో, ఉలవచారు బిర్యాని, మన ఊరి రామాయణం సినిమాలు మంచి ఫ్యామిలీ ఫ్లేవర్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు తన తదుపరి ప్రయత్నంగా ‘ తడ్కా ’ ను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాల్లో వున్న ఈ సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ కు లేదా వచ్చే సంవత్సరం ప్రారంభానికైనా రిలీజ్ అవ్వచ్చని అనుకుంటున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ ప్రకాశ్ రాజ్ !