ఒడిశా తీరం నుంచి భారత రక్షణ శాఖ బుధవారం ప్రయోగించిన షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణి ప్రయోగంపై భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పలు విషయాలను వెల్లడించింది.
‘షార్ట్ రేంజ్ గైడెడ్ మిస్సైల్ 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తాకగలదు’. ‘ప్రళయ్’ పరీక్ష నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. అలాగే, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తమ శాస్త్రవేత్తల పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైన లక్ష్యాన్ని ఛేదించే కొత్త తరం క్షిపణి అని, సాయుధ బలగాలకు ఇది మరింత ప్రేరణాత్మక శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు.