ప్రియుడితో ఉన్నప్పుడు భర్త చూడాలని ప్లాన్.. దుబాయ్ నుంచి పిలిపించి మరీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుడితో ఉన్నప్పుడు భర్త చూడాలని ప్లాన్.. దుబాయ్ నుంచి పిలిపించి మరీ

November 21, 2022

అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే కాకుండా వ్యక్తుల హత్యల వరకు వెళ్తోంది. తాళికట్టిన ఆలిని చేసుకున్న భర్తను భార్య దుబాయ్ నుంచి పిలిపించి మరీ హత్య చేసింది. జగిత్యాల జిల్లాలో జరిగిన హత్యకేసులో పోలీసులు నమ్మలేని నిజాలు వెలికితీశారు. కొడిమ్యాలకు చెందిన బత్తుల శ్రీనివాస్ కు ప్రమీల అనే మహిళలో పదేళ్ల క్రితం పెళ్లయింది. సంతానం లేదు. అయితే బతుకుతెరువు కోసం శ్రీనివాస్ దుబాయ్ వెళ్లగా, భార్యతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుండేవాడు. ఈ క్రమంలో బావ వరుసయ్యే రాజేశ్ అనే వ్యక్తితో ప్రమీల అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్యను కట్టడి చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ దుబాయ్ నుంచి పదే పదే భార్యకు వీడియో కాల్ చేసేవాడు. దీన్ని ఇబ్బందిగా భావించిన ప్రమీల.. తన సుఖానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించడానికి ప్లాన్ వేసింది. దీనికి రాజేశ్, తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. భర్త శ్రీనివాస్ ను దుబాయ్ నుంచి పిలిపించి అతని ముందే ప్రియుడితో కనపడాలని ప్లాన్ వేసింది.

శారీరకంగా కలిసి ఉన్నప్పుడు భర్త చూడాలని, దాని కారణంగా గొడవ పడాలని ముందుగా పథకం వేసి అలాగే భర్తకు పట్టుబడింది. ఇక షరామామూలుగా దంపతుల మధ్య గొడవ జరగగా, చూడకూడనిది చూడడంతో భర్త శ్రీనివాస్ దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయి మద్యానికి బానిసయ్యాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రమీల తన అమ్మ వాడే దీర్ఘకాలిక వ్యాధి మందులను పొడిగా చేసి మద్యంతో కలిపి భర్తకు అందించింది. నవంబర్ 11న శ్రీనివాస్ అపస్మారక స్థితికి వెళ్లడంతో నలుగురూ కలిసి టవల్ తో గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం శవాన్ని చీరతో దూలానికి వేలాడదీసి పారిపోయారు. ఉరేసుకొని చనిపోయినట్టు జనాలను నమ్మించారు. కానీ శ్రీనివాస్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి ప్రమీల, ఆమె తల్లిదండ్రులు, ప్రియుడు రాజేశ్ లే చంపారని తేల్చి వారిని అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన టవల్, ట్యాబ్లెట్, బెడ్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు.