ప్రణబ్ ముఖర్జీకి కరోనా..  - MicTv.in - Telugu News
mictv telugu

 ప్రణబ్ ముఖర్జీకి కరోనా.. 

August 10, 2020

Pranab Mukherjee Test Corona Positive .

కరోనా మహమ్మారి లిస్టులో ప్రముఖుల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు ఈ వైరస్ కాటుకు గురయ్యారు. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కరోనా బారిన పడ్డారు. సోమవారం అతనికి పాజిటివ్ అని తేలిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇతర అనారోగ్య కారణాలతో ఆస్పత్రికి వెళితే అక్కడ పరీక్షలు చేయగా వైరస్ లక్షణాలు బయటపడ్డాయని చెప్పారు. వెంటనే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 

ఈ సందర్భంగా గడిచిన వారం రోజుల్లో తనను కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్తగా పరీక్షలు కూడా చేయించుకోవాలని కోరారు. త్వరలోనే తాను కరోనాను జయిస్తానని ధీమాగా చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు పెడుతున్నారు. ధైర్యంగా ఉంటూ తొందరగా కోలుకోవాలని పలువురు కేంద్ర మంత్రులు సహా రాజకీయ ప్రముఖులు ట్వీట్లు చేశారు.  కరోనా కారణంగా చాలా రోజులుగా ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. ఏ ఇతర కార్యక్రమాలకు హాజరుకావడం లేదు.