ఎన్నికలు సజావుగా జరిగాయి.. ప్రణబ్ ప్రశంస - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికలు సజావుగా జరిగాయి.. ప్రణబ్ ప్రశంస

May 21, 2019

Pranab Mukherjee's Message Amid Opposition Attacks On Election Commission.

ఢిల్లీలో జ‌రిగిన ఓ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్వత్రిక ఎన్నికల నిర్వహణను గురించి కీలక వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌స‌భ ఎన్నిక‌లను నిర్వ‌హించిన తీరు ప‌ట్ల ఎన్నిక‌ల సంఘంను ఆయన మెచ్చుకున్నారు. అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా లోక్‌స‌భ ఎన్నిక‌లు నిర్వ‌హించిన‌ట్లు ఆయ‌న ఈసీ అధికారుల‌కు కితాబిచ్చారు.

ఎన్నిక‌ల సంఘం అధికారులు స‌మ‌ర్థ‌వంతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌లన మ‌న ప్ర‌జాస్వామ్యం విజ‌య‌వంత‌మైంద‌న్నారు. ప్రస్తుత ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ సుకుమార్ సేన్ సహా ఇప్పటివరకు ఆ ప‌దవిలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను ప‌టిష్టంగా చేప‌ట్టార‌న్నారు. వాళ్ల‌ను విమ‌ర్శించ‌లేమ‌న్నారు. భార‌త ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అద్భుతంగా ఉన్నాయ‌ని,  దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్ర‌మ‌ ఉందని తెలిపారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సహా 21 ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల నిర్వహణపై పలుమార్లు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్న తరుణంలో ప్రణబ్ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.