ఈ కాలంలో కూడా దయ్యాలున్నాయా? ఆత్మల రూపంలో ఆయనవారితో మాట్లాడుతాయా? అదేదో సినిమాల్లో చూసాం. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా ? కొందరు మంత్రగాళ్ళు సినిమాల్లో దయ్యాలతో మాట్లాడిస్తాం అంటుంటారు. అది సాధ్యమేనా ? సినిమాల్లో సాధ్యమే.. కానీ, కంప్యూటర్ యుగంలో కూర్చుని ఇవేం మాటలు అనుకోవచ్చు. కానీ మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తామంటూ ఓ దంపతులు ఆమృత ఇంటికి వెళ్లారు. ప్రణయ్య హత్య తర్వత అనేక కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. తాజాగా ఈ మంత్రగాళ్ళ జాదూతనం తెరమీదకు వచ్చింది.వివరాల్లో వెళ్తే… పటాన్ చెరువుకు చెందిన నాగారావు, సత్యప్రియ దంపతులు తమ పిల్లలతో కలిసి ఆదివారం ప్రణయ్ ఇంటికి వెళ్లారు. మొదటగా ప్రణయ్ తల్లిదండ్రలతో మాట్లాడారు. ఆ తర్వాత ఆమృతతో మాట్లాడాలని పిలిచారు. ‘గత జన్మలో మీ నాన్నకు ప్రణయ్‌కు పగ ఉంది. అందుకే ఈ జన్మలో మీ నాన్నచేత చంపివేయబడ్డాడు. నీ ప్రేమకోసం ప్రణయ్ పిలవిస్తున్నాడు. మళ్లీ జన్మలో మీరు భార్యాభర్తలు అవుతారు. ప్రణయ్ ఆత్మ ఇంకా ఇక్కడే ఉందని, విగ్రహం ఏర్పాటు చేస్తే అతని ఆత్మ విగ్రహంలోకి వెళ్లిపోతుంది.. విగ్రహాన్ని ఏర్పాటు చేయండి’ అని చెప్పాడు. ప్రణయ్ తమకు కలలో ఇవన్నీ చెప్తున్నాడని కూడా చెప్పారు.
దీంతో అనుమానం వచ్చిన ప్రణయ్ కుటుంబ సభ్యులు డీఎస్పీ పి.శ్రీనివాస్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన పోలీసులు సత్యప్రియ దంపతులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై ఐపీసీ 420 కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అలాగే ప్రణయ్ ఇంటివద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.