ఆటోడ్రైవర్స్‌కు నటి ప్రణీత ఆసరా! - MicTv.in - Telugu News
mictv telugu

ఆటోడ్రైవర్స్‌కు నటి ప్రణీత ఆసరా!

May 24, 2020

ngfbh

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి నటి ప్రణీత సుభాష్ ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఉన్న అగ్రగామని హీరోయిన్ల కంటే ప్రజాసేవలో ప్రణీత ఎంతో మేలని సినీ అభిమానులు అంటున్నారు. ఇటీవల ఆమె స్వయంగా వంట చేసి పేదలకు పంచిన విషయం తెల్సిందే. 

తాజాగా ఆమె ఆటో డ్రైవర్స్ ను ఆదుకున్నారు. లాక్ డౌన్ నిబంధనల్లో కేంద్రం సడలింపు ఇవ్వడంతో బెంగుళూరు నగరంలో ఆటోలు తిరగడం ప్రారంభమైనది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్స్‌, కస్టమర్స్‌ను వేరు చేసేలా షీట్స్ ఉండటం ఎంతో ముఖ్యం కాబట్టి 100కి పైగా ఆటోడ్రైవర్స్‌కు ఇలాంటి షీట్స్‌తో పాటు శానిటైజర్స్‌ను ప్రణీత పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ..’నగరంలో ఆటోలు తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఆరోగ్య వాతావరణాన్ని పాటించాల్సిన అవసరం ఎంతో ముఖ్యం.’ అని అన్నారు. ప్రణీత ఆటో డ్రైవర్లకు షీట్స్ పంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె నిస్వార్ధ సేవకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.