స్నేహ ఇంట్లో కొత్త మెంబర్.. ఈసారి బేబీ గర్ల్ - MicTv.in - Telugu News
mictv telugu

స్నేహ ఇంట్లో కొత్త మెంబర్.. ఈసారి బేబీ గర్ల్

January 24, 2020

Sneha.

ప్రముఖ నటి స్నేహ రెండోసారి తల్లయ్యారు. శుక్రవారం రోజున ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

View this post on Instagram

Its a girl❤❤

A post shared by Sneha Prasanna (@realactress_sneha) on

తమిళ చిత్రం ‘అచ్చముండు అచ్చముండు’ చిత్రీకరణ సమయంలో నటుడు ప్రసన్నతో స్నేహ ప్రేమలో పడ్డారు. 2012 వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే విహాన్‌ అనే బాబు ఉన్నాడు. కాగా, బాబు పుట్టిన తర్వాత స్నేహ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘పటాస్‌’లో ఆమె నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.