కరోనా వైరస్ పై ప్రశాంత్ వర్మ సినిమా.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్ పై ప్రశాంత్ వర్మ సినిమా..

May 28, 2020

Prasanth varma making movie on coronavirus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా మరో టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడు.

ఈ మేరకు ప్రశాంత్ వర్మ ఈరోజు ట్వీట్ చేశారు. కరోనా మూవీకి సంబందించిన ప్రీ లుక్ ను రేపు విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ తన మొదటి చిత్రంగా ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రం తెరక్కించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ సినిమాకు జాతీయ అవార్డ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమాని తెరకెక్కించి నిరాశపరిచాడు.