మన్నెం నాగేశ్వరరావుపైనా అవినీతి ఆరోపణలు.. ప్రశాంత్ భూషణ్ - MicTv.in - Telugu News
mictv telugu

మన్నెం నాగేశ్వరరావుపైనా అవినీతి ఆరోపణలు.. ప్రశాంత్ భూషణ్

October 24, 2018

సీబీఐ  తాత్కాలిక అధిపతిగా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు చరిత్ర అంత గొప్పదేమీ కాదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. నాగేశ్వరరావుపైనా బోలెడు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అతణ్ని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఆరోపించారు. ‘నాగేశ్వరరావు ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో పనిచేసిన సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అందులో కొన్ని భారీ కుంభకోణాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారు?’ అని  ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు. స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాను కాపాడుకునేందుకే కేంద్రం… అలోక్‌ వర్మను తప్పించిందన్నారు.Prashant Bhushan alleged CBI In charger mannem nageswara rao also corrupt and challenge the removal of Alok Varma సీబీఐలో సాగుతున్న అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని భూషణ్ చెప్పారు. సెలవుపై పంపించిన అలోక్ వర్మ.. రాఫెల్ విమానాల స్కాం కేసును చూస్తుండడంతోనే అతనిపై చర్య తీసుకున్నారని ఆరోపించారు. నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ సీబీఐ డైరెక్టర్ ఇప్పటికే సుప్రీం కోర్టుకెక్కారు. పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకోవడంతో సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను కేంద్రం సెలవుపై పంపడం విదితమే.కాగా, మన్నెం నాగేశ్వరరావు గతంతో ఒడిశా, తమిళనాడుల్లో పని చేసినప్పుడు భూముల లాలాదేవీల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.