పార్టీనా? మాట మార్చిన ప్రశాంత్ కిశోర్ - MicTv.in - Telugu News
mictv telugu

పార్టీనా? మాట మార్చిన ప్రశాంత్ కిశోర్

May 5, 2022

కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ప్రస్తుతమైతే లేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తెలిపారు. అయితే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆక్టోబర్ 2 నుంచి బీహార్‌లో పాదయాత్ర చేయబోతున్నట్టు తెలిపారు. ఒకవేళ ప్రజల తమ సమస్యల పరిష్కారం కోసం ఓ రాజకీయ పార్టీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తానని గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు.

కొన్ని రోజుల క్రితం పీకే(ప్రశాంత్ కిషోర్).. రాజకీయ పార్టీ పెట్టునున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ… సీఎం నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో బీహార్‌కు ఒరిగిందేమీ లేదని, బిహార్ అభివృద్ధి చెందాలంటే సరికొత్త ఆలోచనలు కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం రాబోయే నాలుగేళ్లు ప్ర‌జ‌లకు చేరువై వారి సమస్యలు తెలుసుకుంటానని, తదుపరి కార్యాచరణ గురించి తర్వాత ఆలోచిస్తానని చెప్పారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి ‘జన్ సురాజ్’ పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు పీకే ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కి.మీల పాదయాత్ర కొనసాగుతుందన్నారు.