ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన.. త్వరలో కొత్త పార్టీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన.. త్వరలో కొత్త పార్టీ

May 2, 2022

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీని పెడుతున్నానని తెలిపారు. బీహార్ రాష్ట్రం నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నానని సోమవారం ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో ఆయన కోరిన పదవి కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రశాంత్ కిశోర్ 2014వ సంవత్సరంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందింది. దాంతో పీకే పేరు దేశమంతా మార్మోగింది. ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించడంతో దేశ రాజకీయాల్లో సంచనలంగా మారింది.

ప్రశాంత్ కిశోర్ బీహార్‌ రాష్ట్రం కిషోర రోహౌస్ జిల్లా కోనార్ గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీకాంత్ పాండే సాధారణ వైద్యుడుగా విధులు నిర్వహించేవాడు. వృత్తి రీత్యా బీహార్‌ రాష్ట్రం నుంచి బక్సార్‌కు వెళ్లారు. అక్కడే కిషోర్ మాధ్యమిక విద్యను పూర్తి చేసి, బీజేపీకి ముందస్తు ఎన్నికల ప్రచారంలో ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించారు. అనంతరం 2018 సెప్టెంబరు 16న జనతాదళ్ (యునైటెడ్) రాజకీయ పార్టీలో చేరారు.