కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తర్వాతి క్రేజీ ప్రాజెక్టు సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పడు మరో క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది.
సలార్ సినిమాలో నీల్ వర్స్ అనే కాన్సెప్ట్ ను పరిచయం చేయబోతున్నాడంట దర్శకుడు ప్రశాంత్. అదే కాకుండా ఇందులో కేజీఎఫ్ స్టార్ యశ్ కేమియో రోల్ చేయనున్నాడని సమాచారం. ఇక మరో సూపర్ డూపర్ వార్త ఏంటంటే….విక్రమ్ సినిమాలో ఎండింగ్ లో సూర్య వచ్చి ఎలా అయితే మెరుపులు మెరిపించాడో అలాగే ఈ సినిమా ఎండింగ్ జూ. ఎన్టీయార్ వాయిస్ తో ముగుస్తుందిట. యశ్ రాక ను బట్టి కేజీఎఫ్ కు, సలార్ లింకు ఉంటుందని ఊహిస్తున్నారు క్రిటిక్స్. అలాగే సలార్ తర్వాత మూవీ ప్రశాంత్ ఎన్టీయార్ తో సినిమా తీస్తాడని అంచనా వేస్తున్నారు. అయితే సలార్ విడుదల అయ్యేంతవరకు ఈ విషయాల మీద ఎలాంటి క్లారిటీ రాదు.
ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘కేజీఎఫ్’, షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ‘సలార్’ మూవీతో పాటు NTR31 బ్యాక్‌గ్రౌండ్ థీమ్ కూడా ఒకేలా కనిపిస్తోందని కూడా అంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే విషయాన్ని సూచిస్తోందని చెబుతున్నారు.