‘జాంబీ రెడ్డి’పై వివాదం.. రెడ్డి కులాన్ని కించపరచారని.. - MicTv.in - Telugu News
mictv telugu

‘జాంబీ రెడ్డి’పై వివాదం.. రెడ్డి కులాన్ని కించపరచారని..

August 13, 2020

Prashanth Varma clears the air on Zombie Reddy’s controversy.

సినిమా టైటిళ్లు, కథా కథనాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో చెప్పలేం. అందుకే ఒళ్లన్నీ కళ్లు పెట్టుకుని సినిమాలను రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉంది. తాజాగా ‘జాంబీ రెడ్డి’ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఒక సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బతిన్నట్లు పలు వెబ్‌సైట్లలో వార్తలు రావడంతోతో దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. ఇటీవ‌ల తమ సినిమాకు ‘జాంబీ రెడ్డి’ టైటిల్ని ప్ర‌క‌టించామని.. కొంత‌మంది టైటిల్‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఓ ప్రకటనలో వెల్లడించాడు. ఈ సినిమా ద్వారా ఎవ‌రినీ, ప్రత్యేకంగా ఓ కమ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండదని ఆయన స్పష్టంచేశాడు. టైటిల్‌కు మంచి స్పందన ‌వచ్చిందని.. ట్విటర్‌లోనూ బాగా ట్రెండ్ అయ్యిందని వివరించాడు. ఈ పేరు చాలా బాగుందంటూ చాలా మంది ఫోన్లు చేసి చెబుతున్నారని.. మెసేజులు కూడా చేస్తున్నారని తెలిపాడు. 

ఇదొక వినోదాత్మక చిత్రం అని, క‌రోనా చుట్టూ తిరుగుతూ, క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది అని చెప్పాడు. క‌ర్నూలును ఈ క‌థ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుందని.. ద‌య‌చేసి టైటిల్‌ను త‌ప్పుగా ఊహించుకోవ‌ద్దని ఆయన కోరాడు. కాగా, తెలుగు సినిమా రంగంలో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తర్వాత రాజశేఖర్‌తో ‘క‌ల్కి’ సినిమా తీసి విజయవంతమైన దర్శకుడిగా నిరూపించుకున్నాడు. తాాజాగా ఆయన ‘జాంబీ రెడ్డి’ అనే విభిన్న టైటిల్‌తో కొత్త సినిమా తీస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ లోగో విడుదల చేశాడు. తెలుగులో ఇదే మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ అని అన్నాడు.