సాయికుమార్ పాత్రకు సంజయ్ న్యాయం చేస్తాడా ? - MicTv.in - Telugu News
mictv telugu

సాయికుమార్ పాత్రకు సంజయ్ న్యాయం చేస్తాడా ?

August 22, 2017

2010 లో వచ్చిన ‘ ప్రస్థానం ’ సినిమా ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. దేవాకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా అతని కెరియర్ లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచిపోయింది. రాజకీయ నేపథ్యంలో కుటుంబ విలువలు వంటివి జోడించి చక్కగా వండి వార్చిన అద్భుతమైన తెలుగు సినిమాగా ప్రస్థానాన్ని చెప్పుకోవచ్చు. ప్రస్థానం తర్వాత దేవకట్టా తీసిన ఏ సినిమా కూబి అతనికి పెద్దగా బ్రేకివ్వలేదు. ఆ సినిమాలో సాయికుమార్ పర్ ఫార్మెన్స్ పీక్ లెవల్లో వుంటుంది. అలాగే శర్వానంద్ పాజిటివ్ గా, సందీప్ కిషన్ నెగెటివ్ గా చాలా చక్కగా తమ పాత్రలకు పూర్తి న్యాయమే చేశారు.

అయితే ఈ సినిమాను సంజయ్ దత్ హిందీలో రూపొందిస్తున్నాడు. తనకు ఈ సినిమా స్క్రిప్టు విపరీతంగా నచ్చిందట. ఇప్పుడు తను ‘ భూమి ’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంజయ్ హిందీ‘ప్రస్థానం’ గురించి ప్రస్తావించారు. సాయికుమార్ పాత్రకు తనైతేనే కరెక్టుగా యాప్ట్ అవుతాడు. అందుకే ఈ సినిమా మీద ఆసక్తి కనబరుస్తున్నాడేమో సంజయ్ దత్. భూమి తర్వాత తను ప్రస్థానాన్ని చాలా ప్రెస్టీజియస్ సినిమాగా భావిస్తున్నాడట. మరి హిందీలో కూడా దేవాకట్టానే డైరెక్టరుగా ఎంచుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి వుంది.

తెలుగులో ప్రస్థానం రిలీజ్ అయి ఏడేళ్ళవుతున్నా చాలా మంది యువ దర్శకులకు ఆ సినిమా మంచి గైడెన్సుగా నిలబడిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా స్క్రిప్టు నెట్టులో చాలా మందికి మంచి ప్రాక్టికల్ బౌండెడ్ స్క్రిప్టుగా వున్నదంటే అంచనా వెయ్యొచ్చు.  హిందీలో వస్తే తప్పకుడా ఇది చాలా మంచి చిత్రమే అవుతుందంటున్నారు ప్రస్థానం గురించి తెలిసిన వాళ్ళు.