రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ కౌంటరిచ్చారు. రాహుల్ గాంధీ ఇటీవల ఆర్ఎస్ఎస్ ని 21 వ శతాబ్దపు కౌరవులు అని సంబోధించడం తెలిసిందే. దీనికి ప్రతాప్ సింగ్ స్పందిస్తూ.. 50 ఏళ్ల వయసులో చెల్లికి ముద్దు పెట్టిన పాండవుడు ఎవరు? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కౌరవులు అయితే రాహుల్ గాంధీ పాండవుడా? అని ఎద్దేవా చేశారు. ఇటీవల ఓ సభలో రాహుల్ తన చెల్లి ప్రియాంకా గాంధీకి అప్యాయంగా ముద్దు పెట్టిన ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీన్నే ప్రతాప్ సింగ్ గుర్తు చేశారు. ఇలా ముద్దులు పెట్టడం భారతీయ సాంప్రదాయం కాదని, బహిరంగంగా ఇలా ప్రవర్తించడాన్ని సమాజం ఒప్పుకోదని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు 2024 ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ ఓడిపోతారని ప్రతాప్ సింగ్ జోస్యం చెప్పారు. 2019లో ప్రతాస్ సింగ్ ఈ లోక్ సభ్ స్థానం నుంచి సోనియా గాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఈ సారి గెలుపు తనదేననే ధీమా వ్యక్తం చేశారు. రాయ్ బరేలీ నుంచి వైదొలగనున్న చివరి విదేశీయురాలు సోనియా గాంధీ అని వ్యాఖ్యానించారు. తాను విదేశీయురాలిని కాదని సోనియా చెప్పగలరా? విదేశీయురాలు కాబట్టే గతంలో ప్రధాని కాలేకపోయారు. విదేశీయులు పాలించడాన్ని భారతీయులు ఒప్పుకోరని వెల్లడించారు.