మర్డర్.. వర్మపై ప్రయణ్ తండ్రి ఫిర్యాదు  - MicTv.in - Telugu News
mictv telugu

మర్డర్.. వర్మపై ప్రయణ్ తండ్రి ఫిర్యాదు 

July 4, 2020

varamaaa

వివాదాలను రాజెయ్యడానికే టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తాడని ఓ అపవాదు ఉంది. అయినా వర్మ తన వివాదాలకు బ్రేక్ వెయ్యడు. వరుస సినిమాలు ప్రకటిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రకటించిన ‘మర్డర్’ సినిమా ఇప్పటికే వివాదంలో చిక్కుకుంది. అమృత మామ, ప్రణయ్ తండ్రి బాలస్వామి, వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు రాంగోపాల్ వర్మ‌పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులను ఆదేశించింది. 

తండ్రీకూతుళ్లు అయిన అమృత, మారుతీరావు నిజ జీవితంలో జరిగిన ఘటనలు, అమృత, ప్రణయ్ ప్రేమకథతో ఈ సినిమా తీస్తున్నాడు వర్మ. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ విడుదల చేస్తూ ట్విటర్‌లో వర్మ హడావుడి చేయడం తెలిసిందే. దీనిపై అమృత మీడియా ముందుకు వచ్చి.. ఈ సినిమా ఆపాలని విన్నవించుకున్నా వర్మ వినలేదు. దీంతో ఇప్పుడు ప్రణయ్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో. కాగా, ఈ సినిమాను నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తుండగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.