Pre wedding shoot in gym Woman in Bridal attire seen doing workout, video goes viral
mictv telugu

ఇదో రకం ఫోటో షూట్.. పట్టుచీరలో వర్కవుట్స్ చేస్తూ.. వీడియో వైరల్

August 29, 2022

ఇటీవలి కాలంలో ఫోటోషూట్‌లు ఎక్కువయ్యాయి. ఏ చిన్న వేడుకైనా కూడా ఫోట్‌ షూట్‌ ఉండాల్సిందే అనేంతగా రోజులు మారిపోయాయి..కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫోటోషూట్‌లు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌ కచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఫోటో షూట్‌ పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.


ఇప్పటివరకూ ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఏదైనా కొండ ప్రాంతాల్లో, సముద్ర తీరంలో, పచ్చని పొలాల మధ్య లేదంటే రంగు రంగుల బిల్డింగుల మధ్య చేయడం చూశాం. తాజాగా ఓ యువతి పెళ్లికూతురుగా ముస్తాబై.. పట్టుచీర, బంగారు ఆభరణాలతో జిమ్‌లో డంబెల్స్ ఎత్తుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ వీడియో చూస్తుంటే ఆ యువతి ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగమని తెలుస్తోంది. ఇంత వైరైటీగా ప్రీ వెడ్డింగ్ షూట్‌ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వధువుకి సంబంధించిన ప్రత్యేకమైన ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియోను పూనమ్ దత్తా అనే మహిళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో ఒకటైన ట్విట్టర్‌లో షేర్ చేసింది. కేవలం 27 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 48 వేలకు పైగా వీక్షించగా వందలాది మంది లైక్ చేస్తున్నారు.