రాజకీయాల్లోకి రష్మికా మందన్నా! కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లోకి రష్మికా మందన్నా! కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ

July 24, 2022

ప్రముఖ సినిమా హీరోయిన్ రష్మికా మందన్నా పలు సినిమాలతో బిజీగా ఉంది. కన్నడలో చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి దక్షిణాదిన పలువురు అగ్ర హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేసింది. ఈ నేపథ్యంలో ఈమె గురించి ఓ ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. రష్మిక రాజకీయాల్లో రానున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకెళితే.. ప్రముఖులు మరీ ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారి జాతకాలు చూసి భవిష్యత్తు చెప్పే ఆస్ట్రాటజర్ వేణుస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రష్మిక రాజకీయాల్లోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది’ అని పార్టీ పేరు కూడా చెప్పడంతో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై రష్మిక ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. కాగా, ఇది వరకు నాగచైతన్య – సమంతల విషయంలో వారిద్దరూ విడిపోతారని తాను ముందే చెప్పానంటూ వార్తల్లోకెక్కారు వేణు స్వామి. ఒకవేళ ఈయన చెప్పినట్టు జరిగితే రష్మిక జాతీయ స్థాయి నాయకురాలు అవుతుందనడంలో సందేహం లేదు.