అరుదైన జంతువులపై హింస కొనసాగుతూనే ఉంది. కడుపుతో ఉన్న హిమాలయన్ బ్లాక్ బేర్ జాతి ఎలుగుబంటిని కొందరు దారుణంగా చంపేశారు. అది కడుపుతో ఉందని తెలిసి కూడా దుశ్చర్యకు తెగబడ్డారు. చంపేసిన తర్వాత దాని చర్మం ఒలుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు ఒకడిని అరెస్ట్ చేశారు. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
చంపేసిన తర్వాత ఆ మూగజీవి నాలుక బయటికొచ్చింది. తర్వాత నలుగురు దాని చర్మం వలిచారు. పైనూర్ల్సా సబ్ డివిజన్ మాపితూహ్ గ్రామంలో ఈ నెల 4న వేటకు వెళ్లి ఎలుగును చంపేశారు. దీనిపౌ దర్యాప్తు జరుపుతున్నామని, అరుదైన జంతువులను చంపితే కఠినంగా శిక్షిస్తామని అటవీ శాఖ మంత్రి లాక్మెన్ రింబుయ్ చెప్పారు. అధికారులు, పోలీసులు లాక్ డౌన్ విధుల్లో బిజీగా ఉండడంత వేటగాళ్లు ఇష్టారాజ్యంగా ప్రాణులను బలితీసుకుంటున్నారు.