ఏనుగు హత్య కేసులో తొలి అరెస్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

 ఏనుగు హత్య కేసులో తొలి అరెస్ట్..

June 5, 2020

Pregnant Elephant's Killing In Kerala, First Arrest

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏనుగు హత్య కేసులో కేరళ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుణ్ని పట్టుకున్నారు. రబ్బరు తోటలో పనిచేసే 40 ఏళ్ల వయసున్న నిందితుడు పండులో పటాసు పెట్టాడని పోలీసులు చెప్పారు. అతనికి మరో ఇద్దరు సహకరించారని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. పాలక్కాడ్ జిల్లాలో గత నెల గర్భంతో ఉన్న ఏనుగుకు పైనాపిల్ పండులో పటాసులు పెట్టి తినిపించడం, అది నోట్లో పేలి తీవ్రంగా గాయపడ్డం తెలిసిందే. గాయాన్ని భరించలేక ఆ ఏగును నదిలో ఉండిపోయింది. 

కేరళ అడవుల్లో గత ఏడాది కాలంలో 50కిపైగా ఏనుగులను హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. దంతాల కోసం వాటిని చంపేశారని, స్మగ్లర్లకు కొందరు అటవీ శాఖ సిబ్బంది సహకరించారని సమాచారం. ఆలయాల్లో ఉన్న ఏనుగులకు చిత్రహింసలు పెడుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతుహక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.