ఆటోల ప్రసవం...ఎక్కడో కాదు గాంధీలో..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆటోల ప్రసవం…ఎక్కడో కాదు గాంధీలో..!

August 4, 2017

పేరుకు సర్కారు దవాఖాన ..పేదల పాలిట ఇదొక వరం అని అంటారు కానీ పైసల్ లేనిదే పురుడు వొయ్యరు  ఆడ…ఆ గేటులో అడుగుపెట్టిన వారికి తెలుస్తుంది అక్కడి పరిస్ధితేందో,మనకు వచ్చిన రోగం తగ్గాలంటే…లంచం అనే రోగంతో పీడించుకు తినే వారి చేతులు తడిపితే గాని..నీక పెద్ద డాక్టర్ దర్శనం లభించదు.ఒకవేళ నీదగ్గర పైసలు లేకపోతే  ప్రాణాలు పోయినా పట్టించుకోరు ఇది సికింద్రబాద్ లోని గాంధీ ఆసుప్రతిలో పరిస్ధితి.

పురిటి నొప్పులతో భాదపడుతున్న ఓతల్లి గాంధీ ఆసుపత్రి సిబ్బంది పుణ్యాన ఆటోలో ప్రసవించింది.నొప్పులెక్కువైన అట్టగూడకు చెందిన ఉషా అనే మహిళను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు,అయ్యా ఆడబిడ్డ పురిటినొప్పులతో బాధపడుతుందయ్యా అని సిబ్బందికి చెబితే … స్ట్రెచర్ దీస్కరానికి పైసలైతయ్ అని ఒకలు,ఆమెను దవాఖాన్ల చేర్పిచ్చుకోనికి కొన్ని రూల్స్ ఉన్నయ్ అని ఇంకోలు..ఇట్ల అడుగడుగున…పైసల దాహం,నిర్లక్ష వైనం…ఇగేముంది..పాపం ఆతల్లి  ఆ ఆటోలోనే బిడ్డను కనింది.ఒక్కలంటే ఒక్కలు గుడ  దవాఖాన సిబ్బంది సాయం జెయ్యనీకి రాలేదంటే సూడున్రి…సర్కారు దవాఖానకు పోయిన బీదబిక్కోల్ల పరిస్ధితి ఏమైతదో.

పురిటినొప్పులతోని ఓ తల్లి అంత నరకయాతన అనుభవిస్తుంటే  సూస్తు ఉన్న…మీరెందుకు మీ దవాఖాన్లెందుకుసార్లు, మొన్ననే  దవాఖాన్ల  గర్భిణులకు,కడుపులో ఉన్న బిడ్డలకు ఏం గావద్దని  యాగాలు..యజ్ణాలు జేస్తిరి గదా…ఒహో ఇప్పుడు గుడ అంతా ఆ దేవుడే సూస్కుంటడనీ సూస్కుంట కుసున్నారు…ఏ మన్షులయ్యా.ఓదిక్కు  సర్కార్ దవాఖాన్ల సౌలతులుచ,ట్రీట్మెంట్ జూశి.. ఉన్నోడు గుడ  ప్రైవేట్ దవాఖాన ఇడ్శిపెట్టి ,సర్కార్ దవాఖాన్లకే  ఉర్కిరావాలే అని  ప్రభుత్వమోల్లు తన్లాడుతుంటే…మీరు జేసే ఘనకార్యాలు గిట్లుంటాయ్,ఇగ ఎట్ల నమ్ముమంటరు సారు సర్కారు దవాఖాన్ల కస్తే రోగం కమ్మైతదని..మీ నిర్లక్షంతో ఉన్న పానంగుడ పొయ్యెటట్టు జేస్తున్నరు…అని తిట్టుకుంటున్నరట ఆటోల గ గర్భిణీ తల్లి నరకయాతన జూశినోళ్లంత.

 

source: THE NEWS MINUTE