సీఎం విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా.. వైద్యసేవలో నర్సు - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా.. వైద్యసేవలో నర్సు

May 12, 2020

Pregnant Nurse Duty in Karnataka

కరోనా  కష్టకాలంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రజల పాలిట కనిపించే దేవుళ్లుగా మారారు. నిత్యం కంటికి రెప్పలా చూసుకుంటూ ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నారు. వృత్తిపట్ల అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ.. ప్రజా సేవ చేస్తున్నారు. తాజాగా కర్నాటకలో ఓ 9 నెలల గర్బిణీ కూడా వైద్యసేవలు అందించడం ఆసక్తిగా మారింది. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో తన విధులు నిర్వహిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటోంది. 

గజనూర్ గ్రామానికి చెందిన రూపా పర్వీన్ రావు జయచామ రాజేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణీగా ఉన్నారు. మెటర్నరీ సెలవులతో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా వాటిని కాదని రోగులకు సేవ చేస్తోన్నారు. ఆమె సేవలను గుర్తించిన సీఎం యడియూరప్ప కూడా ఫోన్‌లో మాట్లాడి ప్రశంసించారు. సెలవులు తీసుకోవాలని సూచించారు. అయినా కూడా తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు. ప్రతి రోజూ ఆరు గంటలు పని చేస్తూనే ఉండటం విశేషం.