డ్యాన్స్ చేయలేదని గర్బవతిని కాల్చాడు... - MicTv.in - Telugu News
mictv telugu

 డ్యాన్స్ చేయలేదని గర్బవతిని కాల్చాడు…

April 12, 2018

గర్బవతి అయిన ఓ సింగర్‌ను  పెళ్లి వేడకలో కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్థాన్  సింద్ ప్రావిన్స్‌లో జరిగింది. 24ఏళ్ల సమినా సింధూ  ఓ పెళ్లి విందులో పాటలు పాడింది. అయితే ఆమె గర్బిణి కావడంతో కేవలం కొంత సమయం కూర్యోని పాటలు పాడింది. ఆ తర్వాత ఆమె పై కొందరు డబ్బులు విసురెస్తుంటే నిల్చోని పాడింది. పెళ్లికి వచ్చిన ఓ అతిథి మద్యం తాగి వచ్చాడు. అతను డ్యాన్స్ చేయాలని ఆమెను ఒత్తడి చేశాడు. ఆమె  గర్బవతి కావడంతో డ్యాన్స్ చేసేందుకు నిరాకరిచింది. ఆమెపై కోపంతో తుపాకితో కాల్చాడు. గాయపడ్డ ఆమెను ఆస్పత్రి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికి వరకు ఇద్దరిని అరెస్టు చేశారు.