పైనాపిల్ పండులో పటాసు..గర్భిణి ఏనుగు మృతి
కేరళలో అమానుష సంఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలు తీసాడు ఓ హంతకుడు. మలప్పురం జిల్లాలో మే 27న జరిగిన ఈ విషాదకర సంఘటనను అటవీశాఖ అధికారి మోహన్ క్రిష్ణన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.
ఆకలిగా ఉన్న ఓ గర్భిణీ ఏనుగు అడవికి దగ్గరలో ఉన్న ఓ గ్రామంలోకి ప్రవేశించింది. వీదుల్లో తిరుగుతూంటే దానికి ఓ ఆకతాయి పైన్ ఆపిల్ ఇచ్చాడు. ఆ ఏనుగు దానిని నోట్లో వేసుకోగానే భారీ శబ్ధంతో పేలిపోయింది. ఏనుగుకు భారీగా రక్తస్రావం అయింది. దీంతో సమీపంలోని వెల్లియార్ నది వద్దకు వెళ్లి తొండాన్ని నీళ్లలో ఉంచింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఏనుగు రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మే 27న సాయంత్రం 4 గంటలకు ఏనుగు తుది శ్వాస విడిచింది. ఈ సంఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాంబు ఉన్న పైన్ ఆపిల్ ను ఏనుగుకు పెట్టిన ఆకతాయికి పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందిస్తూ జంతువులను వేధిస్తున్న వారి కోసం కఠినమైన చట్టాలను తేవాలని డిమాండ్ చేశారు.