మధ్యయుగాలనాటి పరిస్థితి ఇంకా మద్యప్రదేశ్ లో కొనసాగుతుందా?వినడానికి,ఊహించడానికి కూడా వీలులేని సంఘటన సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకచ్చింది.ఈ వార్త రాసేటప్పుడు ఒక రకమైన గందరగోళం,వార్తను వార్తగా రాయాలా లేకపోతే ఓ సగటు పౌరుడిగా నాఆవేదనను వెల్లకక్కాలో అర్ధకావడంలేదు.విషయానికస్తే జులై 31 నాడు మధ్యప్రదేశ్ లోని కితాని జిల్లాలో బర్మనీ అనే గ్రామంలో రవాణా సౌకర్యం లేక బీనా అనే నిండు గర్భిణీ మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తూ నీళ్లాడింది.కడుపులోనుంచి బిడ్డ జారి కిందపడి అక్కడికక్కడే మరణించింది.
బైక్ పై సుమారుగా 15 కిలోమీటర్లు పాటు ప్రసవ వేదనను అనుభవించింది ఆ తల్లి.దీనికి కారణం ఆచుట్టు ప్రక్కల ప్రాంతంలో అంబులెన్స్ లు కానీ,కనీస మౌలిక సదుపాయాలు గానీ లేకపోవడమే కారణమని అర్ధమవుతుంది.మన 70 యేండ్ల స్వాతంత్రం బీనా కు మర్చిపోలేని కానుకనిచ్చింది.ఇప్పుడు మేం ఎవర్నీ తిట్టడంలేదు,ఎవర్నీ నిందించడంలేదు.అంతా ఆవిడ కర్మ.