హైదరాబాదులో భారీ సొరంగం నిర్మాణానికి సన్నాహాలు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదులో భారీ సొరంగం నిర్మాణానికి సన్నాహాలు

April 15, 2022

hyd

ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్షిస్తున్న హైదరాబాదుకు ఇప్పుడు మరో ఆకర్షణ జత కానుంది. దేశంలోనే రెండో అతి పొడవైన భారీ సొరంగం నిర్మాణానికి జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తోంది. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌ కింద నుంచి ఈ సొరంగం ఉండబోతోంది. సుమారు ఆరున్నర కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కానుంది. ఈ మేరకు కసరత్తు మొదలైంది.
జూబ్లీహిల్స్ రోడ్ నం 45 నుంచి బంజారా హిల్స్ రోడ్ నం 12 వరకు ఈ సొరంగం ఉండబోతోంది. దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు మే 2వ తేదీ వరకు ఆసక్తి, అర్హత గత సంస్థలు బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ సొరంగం వల్ల ఐటీ కారిడార్‌కు వెళ్లేందుకు సులువుగా ఉండడంతో పాటు పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది. కేటీఆర్ గారి సూచన మేరకు కేబీఆర్ పార్కుకు 30 మీటర్ల లోతు నుంచి సొరంగం నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే దుర్గం చెరువు వద్ద కేబుల్ వంతెన అటు ట్రాఫిక్ పరంగానూ, ఇటు పర్యాటకంగానూ ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే.