గంటాకు షాక్.. ఆస్తుల వేలానికి రంగం సిద్ధం! - MicTv.in - Telugu News
mictv telugu

గంటాకు షాక్.. ఆస్తుల వేలానికి రంగం సిద్ధం!

November 18, 2019

MP Ganta Srinivasa Rao....

టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బ్యాంకు రుణ ఎగవేత కేసులో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ఆస్తుల వేలానికి బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. డిసెంబర్‌ 20న వేలం వేస్తామని ఇండియన్‌ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. మంత్రిగా ఉన్నప్పటినుంచి ఆయనపై ఈ ఆరోపణలు వస్తున్నాయి. భారీగా రుణం తీసుకుని ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా తిరిగి చెల్లించలేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రుణం బకాయిలు రూ. 209 కోట్లు కాగా.. తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 35.35 కోట్లు అని బ్యాంక్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. 

అక్టోబర్ 4న రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసులు కూడా పంపారు. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డిసెంబర్ 20న ఆయన వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 444 గజాల్లో నిర్మించిన ప్లాట్‌ను వేలం వేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, అప్పట్లో ఆయనకు చెందిన ఆస్తులను విశాఖలోని ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గంటా శ్రీనివాసరావు హామీగా ఉన్న కంపెనీ కోట్లల్లో రుణం తీసుకుని చెల్లించకపోవడంతో ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి.