డేరా స్వచ్చ సౌదా ఛీఫ్ గుర్మత్ సింగ్ రామ్ రహీంను అరెస్టు చేయడంతో ఆయన అనుచరులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. జరుగుతున్న ఘటనలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఖండించారు.
శాంతించాలని కోరారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 28 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. నార్త్ ఇండియా నాశనం అవుతున్నది. బాబా అనుచరులు ఢిల్లీ, పంజాబ్, హర్యాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో రోడ్లపైకి వచ్చి విధ్వంసాలకు పాల్పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి కూడా అల్లర్లు పాకడంతో కేంద్ర ప్రభుత్వమూ అలర్ట్ అయింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్నది. మరో వైపు ఆస్తుల విధ్వంసం విషయంలో బాబా ఆస్తులు అటాచ్ చేయాలని కోర్టు చెప్పింది.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బాబాలకు అనచరులుంటారు… నిరసనలు తెలియజేస్తారు. కానీ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసాలకు పాల్పడటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది.