దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవ (Republic Day)వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)జాతీయ యుద్ధ స్మారకం సందర్శనతో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని దేశసేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం అక్కడ నుంచి రాజ్‌పథ్‌కు చేరుకున్న ప్రధాని.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికారు. రాజ్‌పథ్ పేరు మార్చి ఆధునీకరించిన తర్వాత తొలిసారి గణతంత్ర వేడుకలకు కర్తవ్య పథ్ వేదికైంది. రాష్ట్రపతి (President of India)పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కర్తవ్యపథ్‌లో ద్రౌపదీ ముర్ము (president draupadi draupadi murmu) త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. ఈజిప్టు అధ్యక్షుడు(egypt president) అబ్దుల్ ఫతా అల్ సీసీ (Abdel Fattah El-Sisi) రిపబ్లిక్‌డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈజిప్ట్ నుంచి వచ్చిన 120 మంది సైనికుల ప్రత్యేక బృందం కూడా ఈ కవాతులో పాల్గొంది. కర్తవ్య్‌పథ్ పరేడ్‌లో భారత నౌకాదళం, వైమానిక దళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్ లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు ఇందులో ప్రదర్శించారు. 8711 ఫీల్డ్ బ్యాటరీ బృందం ‘21 గన్ సెల్యూట్’ కోసం దేశీయంగా తయారు చేసిన 105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ వాడింది.
ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్, నాగ్ క్షిపణి వ్యవస్థ, కే-9 వజ్రా టీ గన్ సిస్టమ్, బ్రహ్మోస్ క్షిపణులు, బీఎంపీ-2 శరత్ పదాతిదళ పోరాట వాహనం, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ హెవీ వెహికల్ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 861బ్రహ్మోస్ రెజిమెంట్ డిటాచ్మెంట్ ఈ కవాతులో పాల్గొంది. ఒంటెలతో కూడిన బీఎస్ఎఫ్ బృందం ఆకట్టుకుంది. రఫేల్, మిగ్-29, సుఖోయ్ 30, సుఖోయ్ 30 ఎమ్కేఐ జాగ్వార్, సి-130, సి-17, డోర్నియర్, డకోటా, ఎల్‌సిహెచ్ ప్రచంద్, అపాచీ వంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో గర్జించాయి. రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్ లో మొత్తం 44 వాయుసేన విమానాలు విన్యాసాలు చేశాయి.
ఇవి కూడా చదవండి :
సీఎం కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే హక్కు లేదు.. బండి సంజయ్