పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత రాఘవరెడ్డి కోడలు, ఏక్ నాథ్ రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసిన విషయం తెలిసిందే. తనపై జరిగిన వేధింపులు, పోలీస్ స్టేషనులో కేసు నమోదు, రాత్రికి రాత్రి ఇంటి ముందు గోడ కట్టడం, వరకట్న వేధింపులు, అత్తింటిపై ఉన్న ల్యాండ్ కేసులు, భర్త విపరీత ప్రవర్తన గురించి ఏకరువు పెడుతూ తనకు ప్రాణహాని ఉందని, సాటి మహిళగా స్పందించిన తనకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. దీంతో తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. వేధింపుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రపతికి ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సాధారణ మహిళపై జరిగిన వేధింపులపై రాష్ట్రపతి స్పందించడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.