president election 2022: draupadi murmu to campaign in telangana on july 12
mictv telugu

ఈ నెల 12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము

July 9, 2022

president election 2022:  draupadi murmu to campaign in telangana on july 12

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 12వ తేదీన మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వారు దేశవ్యాప్తంగా ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికలలో తమకు మద్దతు ప్రకటించాలని అభ్యర్థులు వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఈ నెల 12 న హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు ఆమెకు స్వాగతం పలుకుతారు. అనంతరం బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తెలంగాణ మేధావులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె పాల్గొంటారు.

ఇక ఇప్పటికే విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా తెలంగాణ రాష్ట్రానికి.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో వచ్చి వెళ్లారు. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికి, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వికాలం ఈ నెల 24 న ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే కొత్త రాష్ట్రప‌తి కోసం జులై 18న ఎన్నిక‌లు నిర్వ‌హించనుంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. జులై 25న కొత్త రాష్ట్రప‌తి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.