అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీలంక అధ్యక్షుడు - MicTv.in - Telugu News
mictv telugu

అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీలంక అధ్యక్షుడు

April 1, 2022

07

శ్రీలంక దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగిపోవడంతో అక్కడి జనాలు ఏం కొనే పరిస్థితి లేక, ఏం తినే పదార్థాలు దొరకాక నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది దేశాన్ని విడిచిపోతుంటే, మరికొంతమంది సరుకుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో చేసేది ఏం లేక శ్రీలంక అధ్యక్షుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. రోజుకు 13 గంటలే విద్యుత్. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నీళ్లు కూడా బ్లాక్‌లో కొనుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. పేపర్ కొరతతో విద్యార్థుల పరీక్షలను వాయిదా వేశారు.. అంటే ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ దేశ ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతూ.. గురువారం అర్ధరాత్రి కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని వేలాది మంది ముట్టడించారు. అంతేకాకుండా అధ్యక్ష భవనం ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటిపోయి, హింసాత్మకంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, నిరసనకారులను అదుపు చేశారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయి, పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో 144 సెక్షన్ విధించింది.