మాలాంటి వాళ్లకు రెండో పెళ్లికి అనుమతినివ్వాలి - MicTv.in - Telugu News
mictv telugu

మాలాంటి వాళ్లకు రెండో పెళ్లికి అనుమతినివ్వాలి

April 18, 2022

02

ఇప్పటివరకూ సమాజంలో భర్తలే భార్యలను హింసిస్తున్నారని సాధారణంగా అనుకుంటాం. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ భార్యా బాధితులు కూడా సమాజంలో పెరిగిపోతున్నారు. అలాంటి వారు ఓ సంఘం కూడా పెట్టుకున్నారు. అలాంటి భార్యా బాధితుల సంఘం సమావేశం ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు పెట్టారు. అవి

1. గృహ హింస కేసుల్లో కోర్టులో విచారణ ఏడాది దాటినా తీర్పు రాకుంటే భర్తలకు రెండో పెళ్లి చేసుకునే అవకాశం కల్పించాలి.
2.498 ఏ అనే సెక్షన్‌ ప్రకారం పెట్టిన కేసులో భర్తల తప్పు లేదని తేలితే వారికి నష్టపరిహారం అందించాలి.
3. భర్తలు అవసరం లేదని చెప్పే భార్యలకు భరణం, నష్ట పరిహారం చెల్లించే అవసరం లేకుండా చూడాలి.
4. వివాహమైన ఏడాది తర్వాత పుట్టింటికి వెళ్లి నెల రోజులైనా మెట్టింటికి రాని భార్యల విషయంలో భర్తలు విడాకులు కోరే హక్కులు కల్పించాలి.