26న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి - MicTv.in - Telugu News
mictv telugu

26న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి

December 11, 2019

President 02

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 22 నుండి 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. 21న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి 22 నుండి 26 వరకు కేరళలో పర్యటిస్తారు. తిరిగి 26న హైదరాబాద్ చేరుకొని 28న న్యూఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

దీంతో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లపై మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రపతి నిలయంలో సీసీటీవీలు, మెడికల్ టీమ్‌లు, టెలీఫోన్ సౌకర్యంతో పాటు న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారని ఆయన స్పష్టం చేశారు.