కరోనా నుంచి గట్టెంక్కేందుకు ఎందరో సహృదయంతో విరాళాలు అందిస్తున్నారు. సామాన్యులు కూడా మేము సైతం అంటూ తమకు తోచిన సాయం చేస్తున్నారు. ప్రభుత్వాలకు అండగా నిలిచే క్రమంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తన విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం తన వార్షిక వేతనంలో 30 శాతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన ఒకసారి పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందజేశారు. మార్చి నెలకి సంబంధించిన తన పూర్తి వేతానాన్ని పీఎం కేర్స్ నిధికి అందజేశారు. తాజాగా తన వార్షిక వేతనంలో 30 శాతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రపతి జీతం రూ.5 లక్షలకు పైగానే ఉంటుంది. ఉపరాష్ట్రపతి జీతం రూ. 4 లక్షలు ఉంటుంది. కాగా, బుధవారం కేంద్రం భారీగా నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పీఎం కేర్స్ ట్రస్ట్ ఫండ్ నుంచి బుధవారం రూ.3,100 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటిలో రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ.1000 కోట్లను వలస కార్మికుల కోసం, మరో రూ.100 కోట్లను వాక్సిన్ అభివృద్ధి కోసం మంజూరు చేశారు.
President Ram Nath Kovind, after contributing one month’s salary to the PM-CARES Fund in March, has decided to forego 30% of his salary for a year. (file pic) pic.twitter.com/n79d4XTFN4
— ANI (@ANI) May 14, 2020