ట్రంప్ మాస్క్ పెట్టుకోడంట.. కారణం అదంట.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ మాస్క్ పెట్టుకోడంట.. కారణం అదంట..

April 4, 2020

President Trump Won't Wear Mask    

కరోనా బారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మాస్కులను ధరిస్తున్నారు. మనిషికి మనిషికి మధ్య కనీసం మీటర్ దూరం ఉండేలా భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు. ఆ వెంటనే తాను మాత్రం మాస్కువేసుకోబోనని స్పష్టం చేశారు. ప్రజలకు జాగ్రత్త చెబుతూ.. ఆయన మాత్రం పాటించనంటూ చెప్పడం ఆసక్తిగా మారింది. 

దీనికి ఆయన వివరణ కూడా ఇచ్చారు. దాని ప్రతి రోజూ ఎంతో మంది దేశాధినేతలు, ప్రముఖులను కలుస్తూ ఉంటానని చెప్పారు. అలాంటి సమయంలో మాస్క్ ధరిస్తే వారికి అసౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏది నేను నా కోసం చూసుకోను అంటూ వ్యాఖ్యానించారు. కాగా అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇప్పటికే 7 వేల ప్రాణాలను కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తప్పనిసరిగా మాస్కులు, చేతి రుమాళ్లు, గ్లౌజులు ధరించాలని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని ప్రజలకు సూచిస్తూ ఆయన ఈ విధంగా మాట్లాడారు. ప్రతి పౌరుడు కూడా భౌతిక దూరం పాటించాలని చెప్పారు.