President Of India Draupadi Murmu to visit Hyderabad on December 28
mictv telugu

మూడేళ్ల తర్వాత నగరానికి రాష్ట్రపతి.. ఎందుకొస్తున్నారంటే

December 1, 2022

PresidentDraupadi Murmu to visit Hyderabad on December 28

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరానికి శీతాకాల విడిది కోసం రానున్నారు. డిసెంబర్ 28 నుంచి 30 వ తేదీ వరకు మూడ్రోజులు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. 28న ఉదయం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకొని 29న వివిధ రంగాల ప్రముఖులు, అతిథులతో భేటీ అవుతారు. డిసెంబర్ 30న సాయంత్రం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ టెంటేటివ్ షెడ్యూల్ పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అటు పోలీస్, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులు, బొల్లారం రాష్ట్రపతి నిలయం సిబ్బంది, జీఏడీ, ఇతర కీలక శాఖ అధికారులతో రాష్ట్ర సీఎస్ త్వరలో కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, చివరిసారిగా 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది చేశారు. అనంతరం కరోనా దెబ్బతో 2020, 2021లలో ఈ విడిది రద్దయింది. ఇప్పుడు దేశ 15వ రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైద్రాబాద్ రానున్నారు.