దళితుడ్ని రాష్ట్రపతిని చేశాడు, అందుకే మా పూర్తి మద్దతు... - MicTv.in - Telugu News
mictv telugu

దళితుడ్ని రాష్ట్రపతిని చేశాడు, అందుకే మా పూర్తి మద్దతు…

June 19, 2017

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ , తెలంగాణ సీఎం కేసీఆర్ మాట విన్నారా…?ఆయన చెప్పినట్టే రామ్ నాథ్ ను ప్రకటించారా..?మొన్నటికి మొన్న అమిత్ షాను భ్రమిత్ షా అంటూ చిటపటలాడిన కేసీఆర్ మాటల్ని మోదీ పరిగణనలోకి తీసుకున్నారా…? అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. ఇంతకు మోదీకి కేసీఆర్ చెప్పారంటే…

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవిద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఎన్డీఏ రాష్ర్టపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవిద్ కు కేసీఆర్ మద్దతు తెలిపినట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్‌నాథ్ కోవిద్‌ను ఎంపిక చేసినట్లు కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఫోన్ ద్వారా తెలిపారు. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడుతూ.. “ఒక దళిత నాయకుడిని రాష్ర్టపతిగా ఎంపిక చేయాలని మీరు సూచించారు. మీ సూచన మేరకు దళిత నేతనే రాష్ర్టపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం, అందుకే మీకు ముందుగా ఫోన్ చేస్తున్నాను, మీ పూర్తి మద్దతు కోరుతున్నాను” అని మాట్లాడారు. తక్షణమే సీఎం కేసీఆర్ పార్టీ నేతలను సంప్రదించారు. ఒక దళిత నేతకు అవకాశం వచ్చినందుకు ప్రధాని విజ్ఞప్తి మేరకు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.