రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ను చీప్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ విడుదల చేశారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 28 చివరి తేదీ తెలిపారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే జులై 17న నిర్వహిస్తామని, జులై 20 కౌంటింగ్ ఉంటుందన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది.
న్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాకపోతే.. తమ తరఫున మరో అభ్యర్థిని ప్రకటిస్తామని సోనియాగాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. మరోవైపు ప్రాంతీయ పార్టీల మద్దతుతో తాము ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకోగలమని బీజేపీ భావిస్తోంది. మెజార్టీ పార్టీలు ఆమోదించే విధంగా అభ్యర్థిని ప్రకటించాలని,దీనివల్ల ఎన్నిక అవసరం ఉండదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అంటున్నారు.