ఫిబ్రవరి 21న ఈల వేయనున్న 'ప్రెజర్ కుక్కర్' - MicTv.in - Telugu News
mictv telugu

ఫిబ్రవరి 21న ఈల వేయనున్న ‘ప్రెజర్ కుక్కర్’

January 24, 2020

 

ి

ఉన్నత చదువులు, విదేశాల్లో భవిష్యత్తు, తల్లిదండ్రుల ఒత్తిడి వంటి యువత చుట్టూ అల్లుకున్న అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. సాయి రోనక్ హీరోగా, ప్రీతి అస్రానీ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సుజయ్, సుశీల్ దర్శకత్వం వహించారు.శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో  ఈ చిత్రం సినిమా పోస్టర్‌ను అభిషేక్ పిక్చర్స్ అధినేత నామా అభిషేక్  ఆవిష్కరించారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. శివరాత్రి పండగ సందర్భంగా ఫిబ్రవరి 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని,  చక్కని వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ‘ఇది వినోదంతోపాటు  సందేశం కూడామేళవించిన సినిమా. పాటలు, రీ రికార్డింగ్ చాలా బాగా వచ్చాయి. రాహుల్ సిప్లిగంజ్ రెండు పాటలు పాడారు” అని అన్నారు.

 

రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి ముఖ్యపాత్రల్లో నటించారు. యువతకు మంచి సందేశం ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఎన్నో అంచనాల నడుమ ఈ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ యువతను ఆకట్టుకుంది. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాల కలయికలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.