రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల వరుసగా కురిసిన వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధానంగా డెంగీ కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో డెంగీ నివారణకు ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను శుభ్రపరుచుకోవాలని వైద్య ఆర్యోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఇంటి చుట్టూ ఉన్న చెత్త చెదారం, నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే మంత్రి తన ఇంటి పరసరాలను స్వయంగా శుభ్రపరిచారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని, ఇంట్లోకి దోమలు రాకుండా చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని తొలగించారు. మొక్కల కుండీలలో ఉన్న నీటిని తొలగించి వాటిని శుభ్రపరిచారు. ప్రజలంతా ఇంటిలో ఉన్న అన్ని నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని సూచించారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగీకి ప్రధాన కారణమని చెప్పారు. డెంగీని ఉమ్మడిగా నివారించాల్సిన అవసరం ఉందన్నారు.