వాళ్లంతా మంత్రులు,ఎంపీ, ఎమ్మెల్యేలు..లైఫ్ లో ఎప్పుడు క్యూ లో నిలపడి ఉంటారు. ఒకవేల పడాల్సి వచ్చినా ఏ ఐదేళ్లకోసారి మాత్రమే.అది లేదంటే లేదు.కానీ సోమవారం క్యూ కట్టారు.ఎంత చక్కగా నిలుచున్నారో చిత్రంలో చూడండి. ఆర్డరేస్తే అన్ని తమ దగ్గరికే తెప్పించుకునే ప్రజాప్రతినిధులు ఎందుకు క్యూ కట్టారంటే..బలమైన కారణం ఉంది. అదే ప్రథమ పౌరుని ఎన్నిక… రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు ఇలా వచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తొలి ఓటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేశారు. పార్లమెంటు హాల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మోదీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు పలువురు కేంద్రమంత్రులు , విపక్ష నేతలు, ఎంపీలు ఓటేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి ఓటేశారు.కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా అన్ని పార్టీ ఎమ్మెల్యేలు ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. అమరావతిలో గల అసెంబ్లీ హాల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓటు వేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.