ప్రియా ప్రకాశ్‌ను  కాసేపే చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా ప్రకాశ్‌ను  కాసేపే చూడండి!

March 24, 2018

ప్రియా ప్రకాశ్ వారియర్.. పరిచయం అక్కర్లేని కుర్రది. కేవలం ఒకే ఒక కనుసైగతో దేశంతోపాటు విదేశాల్లోనూ పేరు సంపాయించుకున్న ఈ మలయాళ సినీభామపై క్రేజ్ పిచ్చపీక్‌కు వెళ్లిపోతోంది. అందుకే ఈ పోస్టరే నిదర్శనం. ప్రియకు ఉన్న క్రేజ్‌ను గుజరాత్ వడోదర పోలీసులు కూడా వాడేసుకుంటున్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాలపై అవగాహన కోసం అమ్మడి ఫోటోతో ఇలా ప్రచారం చేస్తున్నారు. ‘రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. పరధ్యానంతో కాకుండా జాగ్రత్తగా డ్రైవ్‌ చేయండి. #ట్రాఫిక్‌ఏక్‌సర్కార్‌.. ’ కాప్షన్ తగిలించారు. పోస్టర్‌ వడోదరతోపాటు సోషల్ మీడియా అంతటా వైరల్‌ అవుతోంది.

ఈ పోస్టర్ క్రియేటివిటీకి పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు వెళ్తేనే జనాన్ని ఆకట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ పోస్టర్‌ను అట్టేసేపు చూడకుండా, చూసీచూనట్లు వెళ్లిపోయావాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని సరదాగా అంటున్నారు.