ఏపీలో పంటలకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. 2020-21 ఏడాదికి వ్యవసాయ ఉత్పత్తులకు ధరలను నిర్ణయిస్తూ వివరాలను విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లోనే పంటలుచేతికి వస్తుండటంతో కనీస గిట్టుబాటు ధరలను వెల్లడించారు.
పంటలను మద్దతు ధరలకు అమ్ముకోవాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కర్షక్లో పంట వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. తాజాగా వెల్లడించిన ధరలు ఇలా ఉన్నాయి. ధాన్యం క్వింటాల్ రూ. 1,888, మిర్చి రూ.7,000, వేరుశనగ 5,275, మొక్కజొన్న రూ. 1,850, కంది రూ. 6,000,పెసర రూ. 7,196, పొద్దుతిరుగుడు రూ.5,885, జొన్నలు రూ. 2,640, సోయాబీన్ 3,380గా నిర్ణయించారు.