గే అని దారుణంగా హింసించి, జుట్టు కత్తిరించి..   - MicTv.in - Telugu News
mictv telugu

గే అని దారుణంగా హింసించి, జుట్టు కత్తిరించి..  

May 15, 2019

సమాజంలో స్వలింగ సంపర్కులపై వివక్షకు అద్దంపట్టే సంఘటన ఇది. గే అనే కారణంతో ఓ వక్తిని నడిరోడ్డుపై పట్టుకుని మూకదాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్ణాటకలోని మంగళూరులో సోమవారం ఈ సంఘటన జరగింది.

బార్కే ప్రాంతానికి చెందిన బాధితుడు గే అని, అతనికి ఓ వ్యక్తి సంబంధముందని స్థానికులు పట్టుకుని చితకబాదారు. బండబూతులు తిడుతూ, చొక్కా చింపి దాడి చేశారు. జట్టు కత్తిరించి హింసించారు. దాడి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుడు పూజలు చేస్తుంటాడని పోలీసులు చెప్పారు. అతనికి ఓ వ్యక్తితో సంబంధముందని, అయితే సుప్రీం  కోర్టు తీర్పు ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కాదని వెల్లడించారు.