ఏపీలో పూజారి దారుణ హత్య - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో పూజారి దారుణ హత్య

March 22, 2022

ap

దేవాలయంలో పూజలు చేసే ఓ పూజారిని కొంతమంది గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో చోటుచేసుకుంది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివనాగేశ్వరావును గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి గుడి లోపలే హత్య చేశారు.

ఈ సందర్భంగా పూజారి భార్య మాట్లాడుతూ.. ‘సోమవారం అర్ధరాత్రి అయింది. అయిన ఆయన ఇంటికి రాలేదు. దీంతో నాకు భయం వేసి నా బిడ్డలకు, బంధువులకు సమాచారం అందించాను. దీంతో అందరం కలిసి రాత్రి ఆలయం వద్దకు వెళ్లాం. కానీ బయట ఆయన వాహనం కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయాం. పొలం దగ్గరకు కూడా వెళ్లి చూశాం. అక్కడ కూడా లేకపోవడంతో, పని మీద వేరొక ఊరికి వెళ్లి ఉంటాడు అనుకున్నాం. కానీ మంగళవారం తెల్లవారుజామున ఆయన కోసం గాలిస్తుండగా.. ఆలయ ఆవరణలోనే రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది” అని ఆమె కన్నీరు మున్నీరు అయింది. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.