priest performing satyanarayana swamy vratham puja in english goes viral
mictv telugu

ఇంగ్లీష్‌లో సత్యనారాయణస్వామి వ్రత కథ.. నెటిజన్లకు మాటల్లేవ్

August 7, 2022

మారుతున్న కాలాన్ని బట్టి మనుషులూ మారాలి అని నానుడి. ప్రస్తుతం ప్రజలంతా టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ అవుతున్నారు. కంప్యూటర్ నుంచి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్.. ఇలా ప్రతి విషయంలోనూ అప్‌డేట్ అవుతున్నారు. అయితే పూజలు చేయడంలో కూడా పంతుళ్లు అప్‌డేట్ అవుతుండటం విశేషంగానే పరిగణించాలి. తాజాగా ఓ ఇంటి గృహప్రవేశం సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఓ పంతులు ఇంగ్లీష్‌లో చేయించాడు.

 

మాములుగా అయితే తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చదువుతారు. అయితే ఇక్కడ పంతులు అనర్గళంగా ఇంగ్లీష్‌లోనే సత్యనారాయణస్వామి వ్రతం కథను చెప్తుండటంతో నెటిజన్‌లు నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం పంతులు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పంతులు ఇంగ్లీష్‌లో చెప్పే వ్రతాన్ని ఆ ఇంట్లోని వాళ్లు ఆసక్తిగా వింటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రవాస భారతీయులెవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకున్నప్పుడు తీసిన వీడియో అయుండొచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.